యుపిలో నిర్వహిస్తున్న సర్వే హింసాత్మకం.. ముగ్గురు యువకులు మృతి
పోలీసులకు తీవ్ర గాయాలు
లఖ్‌నవూ (CLiC2NEWS): న్యాయస్థానం ఆదేశాలతో యుపిలోని ఓ ప్రార్ధనా మందిరంలో సర్వే నిర్వహిస్తుండగా స్థానికుల నుండి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. ఈ క్రమంలో స్థానికులు, పోలీసులకు మధ్య ఘర్షణలు తలెత్తాయి. ఈఘటనలో ముగ్గురు యువకులు మృతి చెందినట్లు సమాచారం. పోలీసులకు సైతం తీవ్ర గాయాలయ్యాయి. వందలాది స్థానికులు పోలీసుల పైకి రాళ్లురువ్వారు. పోలీసుల, అధికారుల వాహనాలకు నిప్పింటించారు. పోలీసులు ఘటనా స్థలానికి భారీ గా చేరుకుని పరిస్థితులను అదుపులోకి తచ్చేందుకు ప్రయత్నించారు. టియర్‌గ్యాస్ , రబ్బర్ బుల్లెట్లతో ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు.
మొఘల్ కాలం నాటి జామా మసీదుపై కోర్టు సర్వేకు ఆదేశించింది. ఈ క్రమంలో సర్వే కోసం వచ్చిన అధికారులుపై స్థానికులు దాడికి దిగినట్టు సమాచారం. రాళ్లదాడి, హింసాత్మక ఘటనలకు పాల్పడిన 22 మంది పోలీసులను అదుపులోకీ తీసుకున్నారు.