వైస్సార్సీపీ కార్యాలయపు కార్యదర్శిగా టి పుల్లేశ్వరరావు

మండపేట (CLiC2NEWS) : మండపేట అసెంబ్లీ నియోజకవర్గం వైస్సార్సీపీ పార్టీ కార్యాలయపు కార్యదర్శిగా వైసీపీ పట్టణ కార్యదర్శి రిటైర్డ్ పోస్ట్ మాస్టర్ టి పుల్లేశ్వరరావును శాసనమండలి సభ్యులు మండపేట నియోజకవర్గ ఇన్చార్జి తోట త్రిమూర్తులు నియమించారు. రామచంద్రపురం మండపేట పరిసర ప్రాంతాల్లో పోస్ట్ మాస్టర్ గా పనిచేసి పదవీ విరమణ పొందిన పుల్లేశ్వరరావు 1983 నుండి అనగా ఉద్యోగంలో చేరిన నాటి నుండి తోట త్రిమూర్తులు కు అత్యంత వీర విధేయుడిగా ఉన్నారు. ఇదే విషయాన్ని ఆయన మంగళవారం నియోజకవర్గ ముఖ్య అనుచరులతో తోట త్రిమూర్తులు ఈ విషయాలను వివరించారు. తనకు పుల్లేశ్వరరావు మంచి మిత్రుడని అంతేకాకుండా గత 30 సంవత్సరాలుగా తన అభిమాని అని ఆయన వివరిస్తూ ఆయనను విజయలక్ష్మి నగర్ లో నిర్మించిన పార్టీ కార్యాలయం కార్యదర్శిగా నియమించినట్లు తెలిపారు. పుల్లేశ్వరరావు ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు పార్టీ కార్యాలయంలో ఉంటారని తాను లేనప్పుడు నియోజకవర్గ సమస్యలను అత్యవసర విషయాలను తనకు నివేదిస్తారని తోట త్రిమూర్తులు వివరించారు. సౌమ్యుడు వివాద రహితుడు బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన పుల్లేశ్వరరావు నియామకం పట్ల మండపేట నియోజకవర్గం లో పలువురు తమ హర్షాన్ని వ్యక్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.