సౌత్ ఇండియ‌న్ కాపు అసోసియన్ అధ్యక్షులుగా తాడాల దుర్గారావు..

మండపేట(CLiC2NEWS): ఆంద్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు వేల్పూరి శ్రీనివాసరావు, కాపు అసోసియేష‌న్‌ అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులుగా తాడాల దుర్గారావును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సంద‌ర్భంగా సౌత్ ఇండియా కాపు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు శుక్రవారం మాట్లాడుతూ అందరికి సామాజిక న్యాయం, ఆర్ధిక న్యాయం, రాజకీయ న్యాయం సాధించడం, రాష్ట్ర అభివృద్ధి కోసం, అవినీతిని అంతం చేయటం కోసం, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించడం కోసం కాపు అసోసియేషన్ పాటుపడుతుంది అన్నారు. కాపు, తెలగ, బలిజ, ఒంటరి కుల‌స్థులు అంతా పెద్దన్న పాత్ర వహించి నిరంతరం మరో స్వాతంత్య్ర పోరాటం చేయాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.