TamilNaduలో పూర్తిస్థాయి లాక్‎డౌన్

చెన్నై(CLiC2NEWS): దేశంలో క‌రోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. దేశ‌వ్యాప్తంగా ప్రతి రోజు 4 లక్షలకు చేరువలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్ప‌టికే క‌ర్ణాట‌క స‌హా ప‌లు రాష్ట్రాల‌లో నైట్ కర్ఫ్యూలు, వీకెండ్ లాక్ డౌన్ లు, సంపూర్ణ లాక్ డౌన్ వంటి ఆంక్షలు విధిస్తున్నాయి.

తాజాగా తమిళనాడు లో స‌ర్కార్ సంపూర్ణ లాక్ డౌన్ విధించింది. రాష్ట్రంలో 14 రోజుల పాటు సంపూర్ణ లాక్ డౌన్ విధిస్తున్నామని త‌మిళ‌నాడు స‌ర్కార్ వెల్ల‌డించింది. ఈ నెల 10వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 24వ తేదీ అర్ధరాత్రి వరకు లాక్ డౌన్ అమల్లో ఉంటుందని పేర్కొంది. ఈ లాక్‌డౌన్ స‌మ‌యంలో నిత్యావసర దుకాణాలు మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే తెరచి ఉంటాయని పేర్కొంది ప్రభుత్వం. కరోనా సెకండ్ వేవ్ లో భాగంగా కేసులు పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తమిళనాడు సర్కార్ వెల్లడించింది.

Leave A Reply

Your email address will not be published.