రంగయ్య లాంటి ఉపాధ్యాయులు ఈ జిల్లాకు గర్వకారణం: ఎమ్మెల్యే కోనప్ప
జాతీయ ఉపాద్యాయ అవార్డు గ్రహీత రంగయ్యకు ఘనంగా సన్మానం

కాగజ్నగర్ (CLiC2NEWS): రంగయ్య లాంటి ఉపాధ్యాయులు ఈ జిల్లాకు గర్వకారణం అని స్థానిక ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. పి.ఆర్.టి.యు. తెలంగాణ కుంరం భీం జిల్లా శాఖ అధ్వర్యంలో కాగజ్ నగర్ పట్టణంలో జిల్లా అధ్యక్షులు పర్వతి రాజేశ్వర్ అద్యక్షతన ఆ సంఘ నాయకులు, సావర్ఖేడ గ్రామ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు రంగన్న జాతీయ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికైనందున వారికి ఘనంగా సన్మానం ఏర్పాటు చేశారు.
ఈ కార్య్రకమంలో ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మాట్లాడుతూ.. రంగయ్య లాంటి ఉపాధ్యాయులు ఈ జిల్లాకు గర్వకారణం అన్నారు. ఆయన కృషి పట్టుదల ఎంతో ఆనందాన్నిచ్చిందని పేర్కొన్నారు. నాకే అవార్డు వచ్చినంత ఆనందంగా ఉంది అని.. ఇంత గొప్ప ఉపాధ్యాయులు ఈ జిల్లాలో ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నాను అని కోనప్ప తెలిపారు.
మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ పాతూరి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. సాధారణ గ్రామంలోని మారుమూల పల్లెలో పనిచేస్తూ జాతీయస్థాయిలో ఈ జిల్లా పేరును తీసుకెళ్లడం రంగయ్య గొప్పతనం అని అలాంటి గొప్ప వ్యక్తి మన సంఘంలో ఉన్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఇలాంటి ఉపాధ్యాయుల సేవలు యావత్ విద్యావ్యవస్థను కాపాడుతున్నాయని తెలిపారు.
రాష్ట్ర అద్యక్ష ప్రధాన కార్యదర్శులు మారెడ్డి అంజిరెడ్డి, చెన్నయ్య, రాష్ట్ర అధికార ప్రతినిధి పర్వతి సత్యనారాయణ మాట్లాడుతూ.. రంగయ్య కు ప్రభుత్వం సహకరించాలని, వారు మరెన్నో సేవలు అందించడానికి, నిరంతరం కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారని, సంఘం తరపున రంగయ్య కు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు. రంగయ్య కుంరం భీం జిల్లా కు వన్నె తెచ్చారని అభినందనలు తెలియజేశారు.
ఈ కార్యక్రమం లో మంచిర్యాల జిల్లా అద్యక్ష ప్రధాన కార్యదర్శులు ధరణి కోట వేణుగోపాల్, సూరినేని గంగాధర్, ఆదిలాబాద్ జిల్లా అద్యక్ష ప్రధాన కార్యదర్శులు సునీల్ చౌవ్హాన్, నూర్ సింగ్, రాష్ట్ర, జిల్లా నాయకులు కటుకం మధూకర్, చైతన్య, సాగర్, సాంబయ్య, సుధాకర్, గోపికిరణ్, స్వామి, శ్యాంసుందర్,సుధాకర్, అరవింద్ గోపాల్, బి. కైలాస్ , బి. వినోద్ కుమార్ ,ఎ. చంద్రశేఖర్, జాడి రమేష్ తదితరులు పాల్గొన్నారు.