బిజెపిలో చేరిన తీన్మార్ మల్లన్న

ఢిల్లీ (CLiC2NEWS) : జర్నలిస్టు చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న భారతీయ జనతా పార్టీలో చేరారు. బిజెపి కేంద్ర కార్యాలయంలో పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ తరుణ్‌చుగ్ మల్లన్నకు కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం బిజెపి ప్రాథమిక సభ్యత్వాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపి ధర్మపురి అర్వింద్ తదితరులు పాల్గొన్నారు.