తెలంగాణ ఐసెట్‌ ఫలితాలు విడుదల

వరంగల్‌ (CLiC2NEWS): టీఎస్ ఐసెట్ -2021 ఫ‌లితాలు విడుద‌ల‌య్యాయి. వ‌రంగ‌ల్‌లోని కాక‌తీయ యూనివ‌ర్సిటీలో ఉన్న‌త విద్యామండ‌లి చైర్మ‌న్ ప్రొఫెస‌ర్ లింబాద్రి గురువారం ఫ‌లితాలను విడుద‌ల చేశారు. మొత్తం 56,962 మంది అభ్యర్థులు పరీక్షలు రాయగా 51,316 మంది అర్హత సాధించారు. ఉత్తీర్ణత 90.09 శాతం నమోదైంది. ఫ‌లితాల కోసం https://icet.tsche.ac.in/ వెబ్‌సైట్‌ను సంద‌ర్శించొచ్చు.

హైదరాబాద్‌కు చెందిన లోకేశ్‌ మొదటి ర్యాంక్ సాధించాడు. రెండో ర్యాంక్‌ హైదరాబాద్ విద్యార్థి పమిడి సాయి తనూజ, మల్కాజిగిరికి చెందిన నవీన్ కృష్ణన్ మూడవ ర్యాంక్, హైదరాబాద్ నుంచి ఆర్.నవీనశాంత, తుమ్మ రాజశేఖర నాల్గో ర్యాంక్ సాధించి సత్తా చాటారు.

టాప్ టెన్ ర్యాంక‌ర్స్ వీరే..

  1. ఆర్ లోకేశ్ -హైద‌రాబాద్
  2. ప‌మిడి సాయి త‌నూజ – హైద‌రాబాద్
  3. ఆర్ న‌వీన‌క్షంత – మేడ్చ‌ల్ మ‌ల్కాజ్ గిరి
  4. రాజ‌శేఖ‌ర చ‌క్ర‌వ‌ర్తి – మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి
  5. పొట్ల ఆనంద్ పాల్ – కృష్ణా
  6. బెల్లి శ్రీచ‌రిత -మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి
  7. అఖిల్ -మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి
  8. క‌ల్వ‌కుంట్ల మిథిలేష్ -జ‌గిత్యాల‌
  9. క‌త్యాయ‌న నిఖితైశ్వ‌ర్య – హైద‌రాబాద్
  10. అరుణ్ కుమార్ బ‌త్తుల -వ‌రంగ‌ల్ అర్బ‌న్
Leave A Reply

Your email address will not be published.