అజీమ్ ప్రేమ్‌జి వ్య‌క్తిత్వం అంద‌రికీ ఆద‌ర్శం: మంత్రి కెటిఆర్‌

రంగారెడ్డి (CLiC2NEWS):  మ‌హేశ్వ‌రం స‌మీపంలోని ఈ-సిటిలో 30 ఎక‌రాల్లో విప్రో సంస్థ ఏర్పాటు చేసిన క‌న్జ్యూమ‌ర్ కేర్ ప‌రిశ్ర‌మ‌ను మంత్రులు స‌బితా ఇంద్రారెడ్డి, కెటిఆర్, అజీజ్ ప్రేమ్‌జితో క‌లిసి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ..
విప్రో సంస్థ‌ల అధినేత అజీజ్ ప్రేమ్‌జి వ్య‌క్తిత్వం అంద‌రికీ అనుస‌ర‌ణీయం అని, మంచి పాఠం లాంటిద‌ని కొనియాడారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాల‌నే త‌త్త్వం అంద‌రికీ ఆద‌ర్శ‌మని, అజీజ్ ప్రేమ్‌జి అరుదైన వ్యాపారి అని ఐటి, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. క‌రోనా స‌మ‌యంలో తెలంగాణ‌కు కోట్లాది రూపాయ‌లు విరాళంగా అందించార‌ని తెలిపారు.

రూ. 300 కోట్ల‌తో విప్రో ప‌రిశ్ర‌మ ఏర్పాటు చేస్తున్నార‌ని, ఈ ప‌రిశ్ర‌మ ద్వారా సుమారు 900 మందికి ఉపాధి అవ‌కాశాలు ల‌భిస్తాయ‌న్నారు. విప్రో ప‌రిశ్ర‌మ‌లో స్థానికంగా ఉన్న కందుకూరు, మ‌హేశ్వ‌రం ప్రాంతంలోని యువ‌త‌కు ఉపాధి అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయ‌ని మంత్రి తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.