కొత్తగా 6 ప్రైవేట్ యూనివర్సిటీలకు మంత్రివర్గం ఆమోదం

హైదరాబాద్ (CLiC2NEWS): జీఓ 111 ఎత్తివేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన సమావేశమైన కేబినేట్ తీర్మానించింది. ప్రగతిభవన్‌లో ఏర్పటు చేసిన మంత్రివర్గ సమావేశం ముగిసింది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సిఎం కెసిఆర్ మీడియాకు వెల్లడించారు. రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో 3,500 పోస్టుల భర్తీకి విద్యాశాఖ ఆధ్వర్యంలో కామన్ బోర్డు ఏర్పాటు చేసి టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు పారదర్శకంగా భర్తీ చేస్తామన్నారు.
వికారాబాద్ జిల్లా ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు జీఓ111 ఎత్తివేస్తూ మంత్రివర్గం తీర్మానించింది. దానిమీద సిఎస్ నేతృత్వంలో కమిటీ వేశాం. కాలుష్య నియంత్రణ మండలి, అటవీశాఖ అధికారులతో కలిసి కమిటీ ఏర్పాటు చేశామని ఎట్టి పరిస్థితిల్లో మూసీ నది, ఈసా నది, ఆరెండు జలశయాలు కలుషితం కాకుండా గ్రీన్ జోన్స్ డిక్లేర్ చేస్తూ.. మాస్టర్ ప్లాన్ అమలు చేస్తూ జీఓ ఇంప్లిమెంట్ చేయాలని ఆదేశాలిచ్చారు. కొన్ని రోజుల్లో సిఎస్ నేతృత్వంలో అధికారులు సమావేశమై దానికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేస్తారన్నారు. మే 20 నుండి జూన్ 5వ తేది వరకు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించామని తెలిపారు. చెన్నూరు ఎత్తిపోతలకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని, రూ. 1658 కోట్లతో చెన్నూరు ఎత్తిపోతలను నిర్మించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా 103 గ్రామాలకు తాగు, సాగునీరు అందనుంది.