సూర్యాపేట జిల్లాలో రెండు బైకుల ఢీకొని నలుగురు మృతి

సూర్యపేట (CLiC2NEWS): సూర్యపేట జిల్లలో రెండు ద్విచక్ర వాహనాలు అతివేగంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. సూర్యపేట జిల్లా ఆత్మకూరు(ఎస్) మండలం నశీంపేట వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీకొనటంతో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మరణించిన వారంతా 25 సంవత్సరాలలోపు వారని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.