సమ్మక్క దేవతకు పుట్టింటి సారె..

మేడారం (CLiC2NEWS): మేడారంలో కొలువైన సమ్మక్క పుట్టిన ఊరు బయ్యక్కపేటలోని చందా వంశీయులు గురువారం అమ్మవారికి పుట్టింటి సారెను సమర్పించారు. బయ్యక్కపేటలోని సమ్మక్క గుడిలో చీరెను సమ్మక్క దేవతకు సమర్పించారు. గత కొన్ని దశాబ్ధాలుగా సమ్మక్క దేవతకు పుట్టింటినుండి చీరెను సమర్పించటం అనవాయితీగా వస్తున్నది. అనంతరం చందా వంశానికి చెందిన వారు అమ్మవారికి పుట్టింటి నుండి మేళతాళాలతో సారెను తీసుకొని మేడారంలోని సమ్మక్క గద్దె వద్దకు చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పుట్టింటినుండి తల్లికి చెల్లించాల్సిన చీరె, ఒడిబియ్యం, పసుపు, కుంకుమలను సమర్పించారు.