తెలంగాణ, తమిళనాడు ముఖ్యమంత్రుల భేటీ..

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ మంగళవారం తమిళనాడు సిఎంతో భేటీ అయ్యారు. తమిళనాడు పర్యటనలో భాగంగా సిఎం కెసిఆర్ నిన్న శ్రీరంగం రంగనాథస్వామివారిని దర్శించుకున్న విషయం తెలిసినదే. ఈ సందర్భంగా ఆయన సిఎం స్టాలిన్‌ను కలవబోతున్నారని తెలియజేశారు. సిఎం కెసిఆర్ కుటుంబ సభ్యులతో కలిసి స్టాలిన్ నివాసానికి వెళ్లగా..ఆయన పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. కెసిఆర్ యాదాద్రి లక్షీనరసింహస్వామి పునఃప్రారంభోత్సవానికి స్టాలిన్ ను ఆహ్వానించారు. ఇరు రాష్ట్రల సిఎంలు దేశ రాజకీయాల గురించి చర్చించినట్లు తెలుస్తోంది.