వనమా రాఘవ అరెస్టు

కొత్తగూడెం (CLiC2NEWS): కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు వనమా రాఘవేంద్రను పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. దమ్మపేట పరిసరాల్లో పోలీసులు రాఘవను అదుపులోకి తీసుకున్నారు.
పాత పాల్వంచకు చెందిన నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటనలో ఎ-2 నిందితుడు వనమా రాఘవను పోలీసులు విచారణ కోసం కస్టడిలోకి తీసుకున్నారు.
రాఘవ వేధింపుల వల్లనే తమ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు నాగ రామకృస్ణ పేర్కొన్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన ఆయన సెల్ఫీ వీడియో గురువారం బయటకు వచ్చింది. ఆ వీడియోలో నాగరామకృష్ణ.. రాఘవపై తీవ్ర ఆరోపణలు చేశాడు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలు రాఘవను అరెస్టు చేయాలని డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో టిఆర్ ఎస్ పార్టీ రాఘవను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.