తెలుగంటే మన తెలంగాణ తెలుగురా..

తెలుగంటే మన తెలంగాణ తెలుగురా
ఆది కవి యంటె పాల్కురికి సోమనాథుడేనురా
అతిరథ మహా రథులకన్న మన దాశరథి మిన్నరా
సినారె చిత్ర వ్రాతలు వెలుగుచుండు పగలు రేయిరా,
మహా కవి బమ్మెర పోతన్న మనవాడురా
భాగవతాన్ని తెనిగించి యతడు భాసిల్లెనురా
కళ కళ లాడే జలనిధి గల్గిన
కాళేశ్వరము నేడు కనుపించును చూడరా
గోలకొండ కోట, చక్కనైన చార్మినార్-మక్కా మసీద్ ను చూడరా తెలుగు నాట వెలుగుచిందు చారిత్రక సాక్షాలురా
యాదాద్రి నరసన్న -వేములవాడ రాజన్న,
బాలలకక్షరాలు నేర్పించే బాసర భారతమ్మ మనదిరా
ఇక్షు రసముకన్న మథురమైన
అక్షరాలు పలుకు తెలుగు మనదిరా,
ముప్పది మూడు జిల్లాలందు వీధి వీధి విను వీధి నంట
వెలుగొందే గొప్ప భాష, యాస యున్న మన తెలుగురా.
-మంజుల పత్తిపాటి