గ్రామ, సచివాలయ ఉద్యోగులకు ఎపి సర్కార్ గుడ్‌న్యూస్..

అమరావతి (CLiC2NEEWS): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రమ, వార్డు సచివాలయ ఉద్యోగులకు శుభవార్త తెలిపింది. ఉద్యోగులకు ప్రొబేషన్ డిక్లేర్ చేయాలని సిఎం జగన్ మోహనరెడ్డి అధికారులను ఆదేశించారు.జూన్ 30వ తేదీ కల్లా ప్రక్రియ పూర్తి కావాలని, జూలై 1వతేదీ నాటికి వారికి కొత్త జీతాలు అందాలని స్పష్టం చేశారు. మిగిలిన 25% ఉద్యోగులు ప్రొబేషన్ పరీక్షలు కూడా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. మార్చి మొదటి వారంలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సిఎంకు అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా సిఎం జగన్ మాట్లాడుతూ.. ఉద్యోగులకు మంచి జరగాలని సర్వీస్ పెంచాం. పీఆర్సీ అమలు సహా, ఉద్యోగుల కోసం ప్రకటనలు చేశాం. జూన్ 30వ తేదీ లోపు కారుణ్య నియామకాలు చేయాలని, యుద్ధ ప్రాతిపదికన కారుణ్య నియామకాలు ఇవ్వాలన్నారు. అందుకు గ్రామ, సచివాలయ ఖాళీలను వినియోగించుకోవాలన్నారు.