ఎన్నికల కోడ్.. రూ. 34 కోట్ల మేర సీజ్: ముకేశ్ కుమార్ మీనా

అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన నాటి నుండి ఇప్పటివరకు రూ. 34 కోట్ల నగదు, బంగారం, వెండి ఆభరణాలు ఇతర వస్తువులు సీజ్ చేసినట్లు ఎపిసిఇఒ ముకేశ్ కుమార్ మీనా వెల్లడించారు.
నగదు, మద్యం, వాహనాల స్వాధీనానికి సంబంధించి 3,300 ఎఫ్ ఐఆర్‌లు నమోదయినట్లు తెలిపారు. సి-విజిల్ యాప్ ద్వారా ఇప్పటి వరకు 5,500 ఫిర్యాదులు అందాయని, ఎన్నికలకు సంబంధించి 3,040 ఫిర్యాదులను పరిష్కరించినట్లు తెలిపారు.