చిన్న సినిమాల ఐదోషోకు అనుమతి..

అమరావతి (CLiC2NEWS): ఎపి సిఎం జగన్‌తో సినీ ప్రముఖుల భేటీ ముగిసింది. అనంతరం సినీ నటుడు చిరంజీవి మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం ఎంతో సంతోషపరిచిందని అన్నారు. చిన్న సినిమాల ఐదోషోకు అనుమతించడం శుభపరిణామం అని అన్నారు. సమస్యల పరిష్కారానికి సంబంధించి నెలాఖరులోనే జీవో వస్తుందని భావిస్తున్నామని చెప్పారు. మంత్రి పేర్నినాని చొరవతో ఈ సమస్యలకు శుభంకార్డు పడిందని కొనియాడారు. హైదరాబాద్ తరహాలో విశాఖలో సినీ పరిశ్రమను అభివృద్ధి చేయాలని భావిస్తున్నట్లు సిఎం తెలిపారన్నారు.