ఫూల్ మఖానా (తామర గింజలు) ..

తామర పువ్వు గింజలతో తయారు చేయబడే ఆహార పదార్థం. చూడడానికి తెల్లని పాప్ కార్న్లా కనిపిస్తాయి. వీటిని ప్రతి రోజు ఆహారంలో చేర్చుకోవడం ఎంతో మేలు అంటున్నారు నిపుణులు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఫూల్ మఖానాను సంవత్సరానికి 300 రోజులు ఆహారంలో తీసుకుంటానని తెలిపారు. ఈ మఖానా ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యంగా జీవించవచ్చు. అటువంటి ఫూల్ మఖానా వలన కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం.
వీటిలో ఉండే అధిక పీచు- జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. మలబద్దకం, ఇతర ఉదర సంబంధ వ్యాధులు తగ్గుముఖం పడతాయి.
వీటిలో క్యాలరీల శాతం తక్కువగా ఉంటుంది. ప్రొటీన్స్, పీచు త్వరగా ఆకలివేయకుండా నివారిస్తాయి. బరువు తగ్గాలనుకునే వారికి ఈ మఖానా బాగా ఉపయోగపడతాయి.
మైక్రో న్యూట్రియెంట్లు అధికంగా ఉంటాయి. క్యాల్షియం,మెగ్నీషియం , ఐరన్ , ఫాస్సరస్ సమృద్ధిగా లభిస్తాయి.
వీటిని ఆహారంలో చేర్చకుంటే ఎముకలు,దంతాలు దృఢంగా తయారవుతాయి. కీళ్ల నొప్పులు కలవారు రోజు ఆహారంగా తీసుకోవడం మంచిది.
ఎదిగే పిల్లలకు మంచి పోషకాహారం. వారికి ఇష్టమయ్యే విధంగా తయారు చేసి పిల్లలకు ఇవ్వొచ్చు.
వీటిలో ఉండే విటిమిన్ బి కారణంగా మెదడు చురుగ్గా పనిచేస్తుంది.
మఖానాతో వృద్దాప్య ఛాయలు త్వరగా దరి చేరవు.
వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ వలన చర్మంపై ముడతలు రాకుండా నివారిస్తుంది. తెల్ల వెంట్రుకలను నివారిస్తుంది. టైప్ 2 మధు మేహానికి అడ్డుకట్ట వేస్తుంది. రక్తంలోని చక్కెర స్థాయిలను బ్యాలెన్స్ చేస్తుంది.
హార్మోన్లను కూడా బ్యాలెన్స్ చేస్తాయి. తద్వారా భావోద్వేగాలు, ఒత్తిడి అదుపులో ఉంటాయి.
వీటిలో రక్తాన్ని శుద్ధిచేసే డిటాక్సిఫైయింగ్ ఏజెంట్స్ ఉంటాయి. ఇవి శరీరంలో ఉన్న మలినాలను బయటకు పంపిస్తాయి.
యాంటి ఇన్ప్లమేటరీ గుణాలు కిడ్నీ వాపు, నొప్పి సమస్యలను తగ్గిస్తాయి.