HMDA ఉన్నతాధికారులతో కెటిఆర్ సమీక్ష..

హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలోని హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటి కార్యాలయంలో పురపాలక శాఖామంత్రి కెటిఆర్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. ఏడు జిల్లాల పరిదికి విస్తరించి ఉన్నహైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటి (HMDA) అభివృద్ధిలో ఎంతో కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ఇకపై దూరదృష్టితో కొత్త ప్రణాళికలు రూపొందించుకుంటూ ముందుకు సాగాలని ఉన్నతాధికారులకు సూచించారు. మెట్రోపాలిటన్ కమిషనర్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్ కుమార్ HMDA కార్యాచరణను మంత్రికి వివరించారు. ఈ సమావేశంలో హైదరాబాద్ గ్రోత్ కారడార్ లిమిటెడ్ ఎండీ సంతోష్, అర్భన్ ఫారెస్ట్రీ డైరెక్టర్ ప్రభాకర్, HMDA కార్యదర్శి చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.