యాదాద్రి: స్వర్ణ గోపురం ఆవిష్కరించిన సిఎం

యాదాద్రి (CLiC2NEWS): రాష్ట్రంలోని ప్రముఖ పుణ్య క్షేత్రం యాదగిరిగుట్టలోని ఆలయ దివ్య విమాన స్వర్ణ గోపురం సిఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. గోపురానికి మహాకుంభాబిషేకం నిర్వహించారు. గోపుర స్వర్ణ తాపడం కోసం రూ.68 కిలోల బంగారం వెచ్చించారు. రాష్ట్రంలోనే ఎత్తైన ప్రథమ స్వర్ణ తాపడ గోపురం. దీని నిర్మాణానికి రూ.80 కోట్లు ఖర్చయినట్లు సమాచారం. ఈ కార్యక్రమంలో సిఎం దంపతులు, సిఎస్ శాంతి కుమారి తదితర అధికారులు పాల్గొన్నారు.