నిశ్చితార్థం రద్ధు.. బాలిక తల నరికిన యువకుడు..
బెంగళూరు (CLiC2NEWS): మైనర్ బాలికతో తనకు జరుగుతున్న నిశ్చితార్ధాన్ని అధికారులు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన ఆ యువకుడు బాలిక తల నరికి హత్య చేశాడు. ఈ ఘటన కర్ణాటకలోని మడికేరిలోని సూర్లబ్బి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ప్రకాశ్(32) కు అదే గ్రామానికి చెందిన బాలిక(16) తో వివాహం నిశ్చయమైంది. వీరికి ఎంగేజ్మెంట్ జరుగుతున్న సమయంలో బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ అధికారులు వచ్చి ఎంగేజ్మెంట్ను అడ్డుకున్నారు. బాలిక మైనర్ కాబట్టి వివాహం చేయకూడదని.. అలాకాదని చేస్తే జైలు శిక్ష పడుతుందని ఇరు కుటుంబాలకు అవగాహన కల్పించి, ఎంగ్ మెంట్ రద్దు చేశారు. దీంతో ఆగ్రహించిన ప్రకాశ్ బాలి క ఇంట్లోకి వెళ్లి బాలిక తల నరికి హత్య చేసి పరారయ్యాడు.