AP: గెజిట్ ప్ర‌కారం కొత్త జిల్లాల వివ‌రాలు..

నోటిటిఫికేష‌న్ విడుద‌ల చేసిన సర్కార్‌

అమ‌రావ‌తి (CLiC2NEWS): ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో 13 జిల్లాల స్థానంలో 26 జిల్లాల‌ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర స‌ర్కార్ నోటిఫికేష‌న్ జారీ చేసింది. 26 జిల్లాల ప్ర‌తిపాద‌న‌ల నివేదిక‌ను ప్ర‌ణాళిక శాఖ కార్య‌ద‌ర్శి విజ‌య్‌కుమార్ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌మీర్ శ‌ర్మ‌కు అందించారు. దీంతోస‌ర్కార్ నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఈ నోటిఫికేష‌న్‌లో కొత్త జిల్లాలుగా మ‌న్యం, అల్లూరి సీతారామ‌రాజు, ఎన్టీఆర్‌, అన‌కాప‌ల్లి, కోన‌సీమ‌, ఏలూరు, బాప‌ట్ల ప‌ల్నాడు, నంద్యాల‌, శ్రీ‌స‌త్య‌సాయి, కాకినాడ‌, అన్న‌మ‌య్య‌, శ్రీ‌బాలాజీ పేర్ల‌ను సూచించింది. ప్రాథ‌మిక నోటిఫికేష‌న్‌పై స‌ల‌హాలు, సూచ‌న‌లు, అభ్యంత‌రాలు 30 రోజుల్లోగా తెలియ‌జేయాల‌ని కోరింది.

  • జిల్లాపేరు ========== జిల్లాకేంద్రం
  1. మ‌న్యం జిల్లా ========== పార్వతీపురం
  2. అల్లూరిసీతారామ‌రాజు ========== పాడేరు
  3. అన‌కాప‌ల్లి ========== అన‌కాప‌ల్లి
  4. కాకినాడ‌ ========== కాకినాడ‌
  5. కోన‌సీమ‌ ========== అమ‌లాపురం
  6. ఏలూరు ========== ఏలూరు
  7. ఎన్‌టి ఆర్ జిల్లా ========== విజ‌య‌వాడ‌
  8. బాప‌ట్ల ========== బాపట్ల‌
  9. ప‌ల్నాడు ========== న‌ర‌స‌రావుపేట‌
  10. నంద్యాల ========== నంద్యాల‌
  11. శ్రీ‌స‌త్య‌సాయిజిల్లా ========== పుట్ట‌ప‌ర్తి
  12. అన్న‌మ‌య్య జిల్లా ========== రాయ‌చోటి
  13. శ్రీ‌భాలాజీ జిల్లా ========== తిరుప‌తి
Leave A Reply

Your email address will not be published.