ప్రత్యేక హోదా అంశంను అజెండానుండి తొలగించిన కేంద్ర హోంశాఖ..
అజెండాలో మార్పులు చేస్తూ హోంశాఖ ఉత్తర్వులు
ఢిల్లి (CLiC2NEWS): తెలుగు రాష్ట్రాల విభజనకు సంబంధించి పరిష్కారం కాని అంశాలపై కేంద్ర హోంశాఖ ఫిబ్రవరి 17న కీలక సమవేశం నిర్వహించనున్నది. ఈ సమావేశంలో చర్చించే ప్రధాన అజెండా శనివారం ఉదయం రూపొందించారు. తాజాగా అజెండానుండి ప్రత్యేక హోదా అంశంను తొలగిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. ఈ అజెండాలో మార్పులు చేస్తూ ఈరోజు సాయంత్రం మరో సర్క్యులర్ జారీ చేశారు. ఈ అజెండాలో ఐదు అంశాలను పొందుపరిచారు.
ఈరోజు ఉదయం కేంద్ర హోంశాఖ రూపొందించిన అజెండాలోని అంశాలు
- ఎపి ఫైనాన్స్ కార్పొరేషన్ విభజన
- విద్యుత్ వినియోగ అంశాలు
- పన్ను అంశాల్లో సవరణలు
- APSCSCL , TSCSCL సంస్థలో నగదు అంశం
- వనరుల సర్దుబాటు
- 7వెనుకబడిన జిల్లాల్లో అభివృద్ది నిధుల అంశం
- ప్రత్యేక హోదా
- పన్ను ప్రోత్సాహకాలు
- వనరుల వ్యత్యాసం