Mandapeta: వైభవంగా శ్రీజనార్థన స్వామి రథోత్సవం..
మండపేట (CLiC2NEWS): మండపేట పట్టణంలో కొలువు తీరిన శ్రీదేవీ భూదేవీ సమేత శ్రీ జనార్దన స్వామి వారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. భీష్మ ఏకాదశి పర్వదినం సందర్భంగా స్వామి వారి ఊరేగింపు నిర్వహించారు. పట్టణం నలుమూలల నుండి మహిళలు, చిన్నారులు, వృద్ధులు అశేషంగా తరలి వచ్చి రథోత్సవంలో పాల్గొన్నారు. తెల్లవారు జామున స్వామి వారి కల్యాణోత్సవం కనుల పండుగగా జరిగింది. శాస్త్రోక్తంగా కల్యాణోత్సవాన్ని వైఖానస ఆగమోక్తంగా ఖండవల్లి వాసు ఆచార్యుల బృహ్మత్వమున తిరుకళ్యాణ మహోత్సవం జరిగింది. ఆలయ అర్చకులు గోపాల కృష్ణ మాచార్యులు, భార్గవ్ లు శాస్త్రోక్తంగా కల్యాణోత్సవాన్ని నిర్వహించారు.
మున్సిపల్ చైర్ పర్సన్ పతివాడ దుర్గారాణి ఆ వార్డు కౌన్సిలర్ కాళ్ళకూరి స్వరాజ్యభవానీలు కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. శాసన సభ్యులు వేగుళ్ళ జోగేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని టెంకాయ కొట్టి ఉత్సవాన్ని ఆరంభించారు. అంతకు ముందు దేవతా మూర్తులను రథం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయించి కుంబాన్ని సమర్పించారు. అనంతరం జనార్దన స్వామివారి రథం భక్తుల జయ జయ ధ్వానాల నడుము నాయనానంద కరంగా సాగింది. గోవింద నామ స్మరణతో భక్తులు మోకు పట్టి రథాన్ని కలువపువ్వు సెంటర్ వరకూ ముందుకు నడిపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జనార్దన స్వామివారి చల్లని చూపులు ప్రజల అందరిపై చూపించి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకున్నారు. బీ ఎన్ ఎస్ ఎన్ మూర్తి సర్వభూషిత అలంకార ప్రియుడైన జనార్దన స్వామి వారికి దిష్టి తీసి కూష్మాండ చేదన ( గుమ్మడి కాయ పగుల గొట్టుట) గావించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీదేవి ఏర్పాట్లను పర్యవేక్షించారు. పట్టణ ఏ ఎస్సై చిన్నారావు నేతృత్వంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఏడిఈ తిరుమలరావు పర్యవేక్షణలో విద్యుత్ లైన్లను తొలగించారు. రథయాత్ర పూర్తయిన అనంతరం విద్యుత్ పునరుద్ధరణ పనులు త్వరిత గతిన చేపట్టారు.
కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ పిల్లి గనేశ్వర రావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కోన సత్యనారాయణ, వల్లూరి విజయానంద పార్థసారథి ( నల్లబ్బాయి), కౌన్సిలర్ లు యరమాటి గంగరాజు, వైసీపీ టౌన్ బూత్ కన్వీనర్ యరమాటి వెంకన్నబాబు, మల్లిపూడి గణేష్, సాధనాల చక్రపాణి, కోళ్ల శ్రీను, చాపల వీరబాబు, తెల్లాకుల వేణు గోపాల్, శీతిని సూరిబాబు, మాండ్రు పెదకాపు, రెడ్డి గనేశ్వరరావు, చుండ్రు సురేంద్ర, సూరిబాబు, అయ్యప్ప ఆలయ అర్చకులు నంబూద్రి భక్తులు పాల్గొన్నారు.