హుజూర్ న‌గ‌ర్‌: ప్రేమించ లేద‌ని యువ‌తిపై హ‌త్యాయ‌త్నం

హూజూర్ న‌గ‌ర్ (CLiC2NEWS): సూర్య‌పేట జిల్లా హుజుర్ న‌గ‌ర్‌లో ఓ యువ‌తిపై హ‌త్యాయ‌త్నం జ‌రిగింది. త‌న‌ను ప్రేమించ‌డం లేద‌ని యువ‌త‌పై పెట్రోల్ పోసి హ‌త్యాయ‌త్నం చేశాడు నిందితుడు. గ‌మ‌నించిన స్థానికులు నిందితుడిని పోలీసుల‌కు ప‌ట్టించారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివ‌రాల మేర‌కు..ఖ‌మ్మం జిల్లా మోట‌మ‌ర్రి గ్రామానికి చెందిన ఓ యువ‌తి ప‌ట్ట‌ణంలోని త‌న మేన‌మామ ఇంట్లో ఉంటూ.. ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఆమెతో ప‌రిచ‌యం ఉన్న స్వ‌గ్రామినిక చెందిన సుంద‌ర్ ప్ర‌మోద్ కుమార్ ఫోన్ చేసి మాట్లాడాల‌ని చెప్పాడుం దాంతో ఆ యువ‌తి కంపెనీ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చింది. వారిరువురు కోదాడ రోడ్డులో ఉన్న ఓ దుకాణం ఎదుట మాట్లాడుకుంటున్నారు. త‌న‌ను ఎందుకు ప్రేమించ‌డం లేద‌ని యువ‌తితో ప్ర‌మోద్ గొడ‌వ‌పడ‌సాగాడు. ఇంత‌లో త‌న‌తో తెచ్చుకున్న పెట్రోల్ ఆమెపై పోశాడు. వెంట‌నే గ‌మ‌నించిన స్థానికులు అప్ర‌మ‌త్త‌మై పోలీసుల‌కు స‌మాచారం అందించారు.

 

 

Leave A Reply

Your email address will not be published.