కొండరెడ్ల సంపూర్ణ అభివృద్ధి నా కల: గవర్నర్ తమిళిసై

కొత్తగూడెం (CLiC2NEWS): భద్రాద్రి కొత్త గూడెం జిల్లా దమ్మపేట మండలంలోని మారుమూల కొండరెడ్ల గిరిజనుల గ్రామం పూచికుంటలో గవర్నర్ తమిళిసై పర్యటించారు. అక్కడి అంగన్‌వాడి భవనాన్ని ప్రారంభించారు. రూ. 40 లక్షల వ్యయంతో నిర్మించనున్న గోగుల పూడి, పూచికుంట కమ్యూనిటి భవనాలు, అదనపు తరగతి గదుల నిర్మాణానికి గవర్నర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. కొండరెడ్ల సంపూర్ణ అభివృద్ధి తన జీవిత కాల స్వప్నమని తమిళిసై అన్నారు. గిరిజనుల్లో గుర్తించిన పోషకాహార లోపాన్ని తగ్గించేందుకు కృషి చేస్తానని, సేవా దృక్ఫథంతో కూడిన కార్యక్రమాలను అమలు చేసేందుకు చెంచు, గోండుల గ్రామాలను ఎంపికచేస్తున్నానని చెప్పారు.
గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని గిరిజన గూడాన్ని సందర్శించానని, అక్కడి ప్రజల్లో పోషకాహార లోపం ఉన్నట్లు అప్పుడే గుర్తించానన్నారు. అందుకే ఆదిమ గిరిజనుల్లో పోషకాహార లోప నివారణ పైలట్ ప్రాజెక్టులను ప్రారంబించామన్నారు.