AP: టెన్త్, ఇంట‌ర్ ప‌రీక్ష‌ల షెడ్యూల్ విడుద‌ల‌..

అమ‌రావ‌తి (CLiC2NEWS): ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప‌దోత‌ర‌గ‌తి, ఇంట‌ర్ ప‌రీక్ష‌ల షెడ్యూల్ విడుద‌లైన‌ది. రాష్ట్ర మంత్రులు ఆదిమూల‌పు సురేష్‌, బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి విడుద‌ల చేశారు. మార్చి 11 వ తేదీ నుండి 31 వ‌ర‌కు ఇంట‌ర్మీడియ‌ట్ ప్రాక్టిక‌ల్ ప‌రీక్ష‌లు, పేప్రిల్ 8 నుండి 28 వ‌ర‌కు ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు ప‌రీక్ష‌లు జ‌రుగుతాయ‌ని ఎపి విద్యాశాఖామంత్రి ఆదిమూల‌పు సురేష్ తెలిపారు. రాష్ట్రం మొత్తంలో 5,05,052 మంది విద్యార్థులు మొద‌టి సంవ‌త్స‌రం, 4,81,481 మంది విద్యార్థులు ద్వితీయ సంవ‌త్స‌రం పరీక్ష‌లు రాయ‌నున్నార‌ని తెలిపారు.

ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్షలు మే 2వ తేదీ నుండి మే 13వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హిస్తామ‌ని తెలిపారు. మొత్తం 6,39,805 మంది విద్యార్థులు ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు రాయ‌నున్నార‌ని మంత్రి తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.