తిరుమల శ్రీవారి దర్శన టికెట్లు పెంచాలని టిటిడి నిర్ణయం

తిరుమల (CLiC2NEWS): తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి దర్శన టికెట్ల సంఖ్య పెంచాలని నిర్ణయించింది. ఫిబ్రవరి 16వ తేది నుండి తిరుపతిలో సర్వదర్శనం టికెట్లు జారీ చేయనున్నట్లు టిటిడి ఈఓ జవహర్ రెడ్డి వెల్లడించారు. కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. కరెంట్ బుకింగ్ ద్వారా రోజుకు 10 వేల టికెట్లు జారీ చేస్తామని ఈఓ తెలిపారు. టిటిడి ప్రాణదాన ట్రస్టుకు రూ.కోటి విరాలమిచ్చిన వారికి ఉదయాస్తమాన టికెట్లు జారీ చేస్తామన్నారు. టిటిడి వెబ్సైట్ ద్వారా ఉదయాస్తమాన సేవా టికెట్లు బుకింగ్‌కు ప్రత్యేక పోర్టల్ తీసుకొస్తున్నట్లు ఆయన తెలిపారు. భక్తులు ఆన్లైన్ ద్వారా విరాళమిచ్చి ఉదయాస్తమాన సేవా టికెట్స్ పొందవచ్చని తెలిపారు.