కవి గానే జన్మిస్తా..

కవి గానే జన్మిస్తా..
రవి గాంచని చో
కవి గాంచును..
తన కలమనే
తూణీరం లోంచి
అక్షరాలను సంధించును..
కదలని రాయినైనా
కదిలించును..
అగ్ని ధారలను
కురిపిస్తూ మరో ప్రపంచం సృష్టించును..
తెలియని.. అగుపడని
కావ్య కన్నిక కోసం..
ఊహాతీత ఖండికలను
లిఖిస్తూ రసరమ్య డోలికల్లో
విహరిస్తూ విరహగీతం,
ప్రణయ గీతం,
ప్రళయ గీతం
రాయగలడు
ఓ కవీ..
సకల సామ్రాజ్యామూ నీదే
విజ్ఞాన, వినోదమైనా..
విధంసమైనా
ఇందుగలడు..
అందులేడని సందేహమే లేదు…
అన్ని లోకాలూ నీవే
అందరి వాడవూ నీవే..
అందలేని వాడవూ నీవే..
ఓ కవీ నీకు చేతులెత్తి మొక్కుతా
మరో జన్మంటూ ఉంటే
కవిగానే జన్మిస్తా..
మీ
ఎస్.వి.రమణా చార్య
(నేడు మార్చ్ 21 ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా