తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా బోధించాలి: సిఎం జ‌గ‌న్‌

అమరావతి (CLiC2NEWS): పాఠ‌శాల‌ల్లో విద్యార్థుల నిష్పత్తికి తగినట్లుగా ఉపాధ్యాయుల‌ను  ఉంచాలని, టీచర్ల అనుభవం, బోధనలో వారికున్న నైపుణ్యాన్ని వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. సీఎం వైఎస్‌ జగన్‌ తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో విద్యాశాఖపై బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్కూళ్ల వర్గీకరణకు తగినట్టుగా టీచర్లను పెట్టాలని, విద్యార్థుల నిష్పత్తికి తగినట్టుగా టీచర్లను ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఆగ‌స్టు 16వ తేదీన‌ పశ్చిమగోదావరి జిల్లాలో విద్యా కానుక ప్రారంభం కానుందని తెలిపారు. విద్యార్థుల సంఖ్య మేరకు టీచర్లపై ప్రతిపాదనలను అధికారులు తెలిపారు. నూతన విద్యావిధానం ప్రకారం 6 రకాలుగా పాఠశాలల వర్గీకరించనున్నారు. పీపీ-1 నుంచి 12వ తరగతి వరకు 6 రకాలుగా వర్గీకరిస్తారు.

నూతన విద్యావిధానం స్కూళ్లను 6 రకాలుగా వర్గీకరణ 

  1. శాటిలైట్‌ స్కూల్స్‌ (పీపీ-1, పీపీ-2)
  2. ఫౌండేషన్‌ స్కూల్స్‌ (పీపీ-1, పీపీ-2. 1, 2)
  3. ఫౌండేషన్‌ ప్లస్‌ స్కూల్స్‌ ( పీపీ–1 నుంచి 5వ వరగతి వరకూ)
  4. ప్రీ హైస్కూల్స్‌ ( 3 నుంచి 7లేదా 8వ తరగతి వరకూ)
  5. హైస్కూల్స్‌ (3 నుంచి 10వ తరగతి వరకూ)

వర్గీకరణతో 14 వేల పాఠశాలలు అదనంగా అవసరమని సీఎం జగన్​కు అధికారులు తెలిపారు. కొత్త వర్గీకరణకు తగినట్టుగా టీచర్లు ఉండాలని సీఎం ​ అన్నారు.  హైస్కూల్‌ ప్లస్‌ (3వ తరగతి నుంచి 12వ తరగతి వరకూ) వర్గీకరించామని అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. పీపీ–1 నుంచి 12వ తరగతి వరకూ వర్గీకరణ వల్ల సుమారుగా ఇప్పుడున్న స్కూల్స్‌  44వేల నుంచి సుమారు 58వేల స్కూల్స్‌ అవుతాయని అధికారులు సీఎం జగన్‌కు తెలిపారు.

తెలుగును తప్పనిసరి సబ్జెక్ట్‌గా బోధించాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. నూతన విద్యావిధానం, నాడు-నేడు కోసం రూ.16 వేలకోట్ల ఖర్చు చేస్తున్నామని తెలిపారు. కొత్త విద్యా విధానంపై అవగాహన కార్యక్రమం నిర్వహించాలని సీఎం జగన్​ అధికారులకు సూచించారు. విద్య ఎదుగుదలకు ఓ ఆయుధం అన్న సీఎం..  ఆ శాఖపై ఫోకస్ పెట్టి.. మెరుగైన ఫలితాలు రాబట్టాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశానికి  రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Leave A Reply

Your email address will not be published.