జనగామలో నూతన కలెక్టరేట్‌ను ప్రారంభించిన సిఎం కెసిఆర్

జనగామ (CLiC2NEWS): జిల్లాలో నూతనంగా నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని సిఎం కెసిఆర్ శుక్రవారం ప్రారంభించారు. అనంతరం ముఖ్యమంత్రి కెసిఆర్ మాట్లాడుతూ.. ఒకప్పుడు జనగామ పరిస్థితి చూస్తే కన్నీళ్లు వచ్చేవి అని గుర్తు చేశారు. ఏడు సంవత్సరాల క్రితం ఎక్కడో ఉన్నాం, ఇవాళ అభివృద్ధిలో ముందున్నామని సిఎం అన్నారు. జనగామ నూతన భవన సముదాయాన్ని డిజైన్ చేసిన ఆర్కిటెక్ట్‌ను, భవనాన్ని నిర్మించిన ఈఎన్సీని అధికారులకు, ప్రజాప్రతినిధులకు పరిచయంచేసి కంగ్రాట్స్ చెప్పారు.
ఈ కార్యక్రమంలో మంత్రుల, సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రశాంత్ రెడ్డి, భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన టిఆర్ ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పలువురు పాల్గొన్నారు. అనంతరం జిల్లా అభివృద్ధిపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారుతో సమీక్ష నిర్వహించారు.