TG EAPCET: నేటి నుండి దరఖాస్తుల స్వీకరణ షురూ..

హైదరాబాద్ (CLiC2NEWS): నేటి నుండి తెలంగాణలో ఎప్‌సెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఇంజినీరింగ్, ఫార్మసి, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టిజి ఎప్‌సెట్ పరీక్షకు నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఆన్‌లైన్ల దరఖాస్తుల స్వీకరణ శనివారం నుండి ప్రారంభమయ్యాయి. ఇంజినీరింగ్ , ఫార్మసి రెండు పరీక్షలకు హాజరయ్యేవారు ఒకేసారి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పరీక్షను ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ మూడు భాషల్లో నిర్వహిస్తున్నామని టిజిఎప్ సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ డీన్ కుమార్ వెల్లడించారు. దరఖాస్తులలో ఫోన్ నెంబర్, మెయిల్ ఐటి తప్పనిసరిగా పొందుపరచాలని సూచించారు. ఎప్‌సెట్ సమాచారమంతా ఆయా మెయిల్ ఐడిలకే పంపిస్తామని తెలిపారు.