ఆ గూడేనికి బస్సొచ్చింది..

తిర్యని (CLiC2NEWS): ఎటు చుసిన కొండలు, గుట్టలు దట్టమైన అటవి ప్రాంతం. మావోయిస్టులకు గతంలో స్థావరం.. గత ఎడాది పోలీసులకు, మావోలకు ఎదురుకాల్పులు సైతం జరిగిన ప్రాంతం. అటువంటి ఊరికి అర్ టి సి బ‌స్సు రావడమేంది? అందులొ గొప్పేముంది అనుకుంటున్నారా ? మరి ఈ ఆదివాసి గుడానికి బస్సు రావడము గొప్పే. ఎందుకంటే.. ఈ బస్ కోసం పాతికేళ్ళనుండి ఇక్కడి అదివాసులు ఎదురు చూస్తున్నారు.

వివరాలలోకి వెళ్లే…
కొమరం భీం అసిఫాబాద్ జిల్లా తిర్యని మండలంలోని మంగీ ప్రాంతం దట్టమైన అడవులతో చుట్టుపక్కల చిన్న చిన్న ౩౦ ఆదివాసి గూడేల సమూహారమే ఈ మంగీ. మండలకేంద్రానికి 25 కిలోమీట‌ర్ల దూరంలో ఉంది. ఇక్క‌డికి అత్యవసర స‌మ‌యంలో 108 అంబులెన్సు కుడా వెళ్లలేని దుస్థితి..

గతంలో 1995 వరకు ఇక్కడికి బస్ తిరిగేది.. కానీ కాలక్రమములో మంగీ ఘట్ రోడ్డు పుర్తిగా దెబ్బతినడంతో వాహనాల రాకపోకలకు రహదారి సరిగాలేకపోవడం .. దానికి తోడు ,మావోయిస్ట్ ల ప్రభావము కుడా ఉండటంతో అధికారులు బస్సు సర్వీసు నిలిపివేశారు. అప్పటినుండి మంగీ పరిసర గ్రామాల అదివాసులు బస్ ఎక్కాలంటే తిర్యానికి రావలసిందే..

ఇలాంటి ప‌రిస్థితుల్లో ఇటివల భారీ వర్షాలకు మంగీ ఘట్ రోడ్డు ౩ కిలోమీట‌ర్ల మేర పుర్తిగా దెబ్బతిని కంకర తేలి ద్విచక్ర వాహనాలు సైతం వెళ్లలేని ప‌రిస్థితి నెల‌కొంది. ఈ క్ర‌మంలో ఈ విషయాన్ని తిర్యాణి పోలీసుల దృష్టికి తీసుకువెల్లడముతో తిర్యాణి ఎస్ ఐ పి రామరావు వెంటనె స్పందించి తిర్యాణి మండల ట్రాక్టర్లు ఓనర్స్ సహకారంతో జె సి బి 15 ట్రాక్టర్లతో స్తానిక మంగీ గ్రామస్తులను సమన్వయము చేసుకొని మూడు రొజులు పాటు శ్రమించి దాదాపు 350 ట్రిప్పుల మొరం వేయించడముతో ఘట్ రోడ్డు కి మరమ్మతులు జరిగి వాహనాల ప్రయాణానికి అనుకూలముగా మారింది.

ఇప్పుడు ఆ గ్రామానికి అంబులెన్సు108, 102. లాటి వాహనాలు వస్తున్నాయి. అదేవిదంగా స్థానిక ప్ర‌జ‌ల‌కు రేషన్ తెచ్చుకోవడానికి రొంపల్లి వరకు వెళ్లే బాధ తప్పింది.

మంగీ ప్రజల కోరికమేరకు అసిఫాబాద్ అర్ టి సి డిపో మేనేజర్ తో మాట్లాడి అసిఫాబాద్ నుండి మంగీ కి అర్ టి సి బస్సు సౌక‌ర్యాం ఏర్పాటు చేయడంతో అదివాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సందర్బముగా తిర్యాణి ఎస్ ఐ పి రామరావు మాట్లడుతూ.. మంగీ ప్రజలకోరిక మేరకు పోలీస్ మీకోసం కార్యక్రమములో భాగంగా ఘాట్ రోడ్డుకు 3 కిలో మీటర్ల మేర మరమ్మతులు నిర్వహించి అర్ టి సి బస్ గూడేలకు రావాలనే మంగీ వాసుల కోరికను జిల్లా ఎస్ పి సుదీంద్ర సహకారంతో తీర్చామని తెలిపారు. ఈ బస్సు వలన కౌతగం ,గుండాల ,మంగీ ,ముల్కలమంద,మణిక్యపూర్ గ్రామ పంచాయతి పరిధిలోని దాదాపు ౩౦ ఆదివాసి డూడేల ప్రజలకు మండల, జిల్లా కేంద్రానికి వెల్లడానికి రవాణా సుళువైనదని తెలిపారు . కాగా గ‌త ఆదివారము మంగీ వరకు బస్ ట్రయిల్ నిర్వహించగా, ఈ బస్ సర్వీసు గురు వారం రోజున‌ జిల్లా ఎస్ పి వైవిఎస్ సుదీంద్ర, అర్ టి సి అసిఫాబాద్ డిపో మేనేజర్ మంగీ నుండి ప్రారంభించారు.

Leave A Reply

Your email address will not be published.