పంజాబ్ తరహాలో ధాన్యం కొనుగోలు చేయాలి..

తుర్క‌ప‌ల్లి (CLiC2NEWS): టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కెటిఆర్‌ పిలుపుతో ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్రెడ్డి ఆదేశానుసారం సోమవారం తుర్కపల్లి మండలం కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తెలంగాణ రైతు వ్యతిరేక విధానాల పట్ల ఆందోళనలు, నిరసనలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మంజుల పత్తిపాటి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం యాసంగి వరి ధాన్యం కొనుగోలు చేయాలి, రైతు పొలంలో మోటర్లకు మీటర్లు బిగించే కుట్రను మానెయ్యాల‌ని, ఉపాధి హామి పనులు వ్యవసాయానికి అనుసంధానం చేయాల‌ని అన్నారు. పంజాబ్ తరహాలో రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేయాల‌ని అన్నారు. రైతులపై కుట్రలు చేస్తే రైతులు, ప్రజలు బిజెపి పార్టీకి బుద్ధి చెప్తారాని కేంద్రం ప్రభుత్వం పై విమర్శలు వ్యక్తం చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో మండల టిఆరెస్ పార్టీ సర్పంచులు, ఎంపిటీసీలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.