TS: ఈ ఏడాది రూ.1000 కోట్ల వ్యయం: సిఎం కెసిఆర్‌

హైదరాబాద్‌ (CLiC2NEWS): ప్రగతిభవన్‌లో కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఇతర అధికారులతో శనివారం జరిగిన సమావేశంలో సిఎం కె. చంద్ర‌శేఖ‌ర‌రావు ‘సీఎం దళిత్‌ ఎంపవర్‌మెంట్‌ స్కీం’ గురించి మాట్లాడారు. దళిత సాధికారత కోసం రాష్ట్ర స‌ర్కార్‌ ప్రణాళికలు రూపొందిస్తున్న‌ద‌ని రచిస్తున్నదని, ఆదివారం ఉదయం 11.30 గంటలకు జరిగే అఖిలపక్ష సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంలో కలెక్టర్లు, ఉన్నతాధికారుల పాత్ర కీలకమని అన్నారు. ఈ పథకంలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న దాదాపు 8 లక్షల దళిత కుటుంబాలను దశలవారీగా అభివృద్ధి పరచడమే లక్ష్యంగా కార్యక్రమాలు నిర్వహించబోతున్నామని పేర్కొన్నారు. ఇందుకుగాను రూ.1,000 కోట్లు ఈ ఏడాది ఖర్చు చేయబోతున్నామని సీఎం ప్రకటించారు.

Leave A Reply

Your email address will not be published.