డ్రగ్స్ కేసులో మహిళకు 13 ఏళ్ల జైలు శిక్ష: రంగారెడ్డి కోర్టు
హైదరాబాద్ (CLiC2NEWS): డ్రగ్స్ కేసులో రంగారెడ్డి జిల్లా కోర్టు ఓ మహిళకు 13 ఏళ్ల జైలు శిక్షను విధించింది. 2021 లో ఉగాండా నుండి నగరానికి ఓ మహిళ డ్రగ్స్ తీసుకురాగా.. ఆమెను డిఆర్ఐ అధికారులు అరెస్టు చేశారు. ఆమె వద్ద నుండి హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. హెరాయిన్ విలువ దాదాపు రూ.25 కోట్లుంటుందని అధికారులు వెల్లడించారు. సుదీర్థ వాదనల అనంతరం న్యాయస్థానం నిందితురాలికి 13ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.లక్ష జరిమానా విధించింది.