తిరుపతి మెట్ల మార్గం మొత్తం ధ్వంసమయింది
రాజంపేట వరదలో చిక్కుకుని 12 మంది మృతి

తిరుపతి (CLiC2NEWS): తిరుమలలో కురుస్తున్న భారీ వర్షాలకు నడక మార్గాల్లో చెట్లు కూలిపోవడం, కొండచరియలు విరిగిపడుతున్నాయి. మెట్ల మార్గం మొత్తం ధ్వంసమయింది. టిటిడి ముందు జాగ్రత్త చర్యలుగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అలిపిరి, శ్రీవారి మెట్ల మార్గాలను మూసివేసింది. కొండల్లోని చెత్త, మట్టి అంతా మెట్ల మార్గం వద్ద పేరుకుపోయింది.
భారీ వర్షాలకు రాజం పేట సమీపంలోని అన్నమయ్య జలాశయం మట్టి కట్ట కొట్టుకుపోయింది. దీంతో చాలా గ్రామాలు నీటమునిగాయి. మందపల్లి, ఆకేపాడు, నందలూరు ప్రాంతంలో 3 ఆర్టీసీ బస్సలు వరద నీటిలో చిక్కుకుపోయిన విషయం తెలిసినది. సుమారు 30 మంది వరద నీటిలో కొట్టుకుపోయారు. వారిని వెతెకేందుకు ఉదయం నుండి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 12 మంది మృత దేహాలు లభ్యమయ్యాయి.