గోదావరిలో దూకిన కుటుంబం.. ఒకరు మృతి
బాసర (CLiC2NEWS): అప్పుల బాధ తాళలేక ఓ కుటుంబం గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన నిర్మల్ జిల్లా బాసర వద్ద చోటుచేసుకుంది. ఈ ఘటనలో చిరు వ్యాపారి ఉప్పలించి వేణు మృతి చెందగా.. ఆయన భార్య సురక్షితంగా బయటపడ్డారు. కుమార్తె గల్లంతయినట్టు సమాచారం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారాం.. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు కు చెందిన వేణు కుటుంబం నిజామాబాద్ పాన్‌షాపు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. షాపు సక్రమంగా నడవక పోవడంతో స్థానిక వడ్డీ వ్యపారుల వద్ద రుణాన్ని తీసుకున్నారు. కాగా.. అప్పులిచ్చిన వారు తిరిగి చెల్లించాలని ఒత్తిడికి గురిచేశారు. దీంతో మనస్తాపానికి గురైన వేణు భార్య, కుమార్తె తో సహా బాసర వద్ద గోదావరిలోకి దూకారు. అనురాధను స్థానిక గంగపుత్రులు కాపాడి, పోలీసులకు సమాచారమందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అనురాధ భర్త, కుమార్తె కోసం గాలించగా వేణు మృతదేహం లభ్యమైంది. కుమార్తెకోసం గాలిస్తున్నారు. కుమార్తెకు ఇటీవల నిశ్చితార్థం జరిగి కొన్ని రోజులలో పెళ్లి జరగాల్సి ఉండగా.. విషాదం చోటుచేసుకంది.