ఉగాది ప‌చ్చ‌డిలో దాగి ఉన్న ఔష‌ధ గుణాలు..

ష‌డ్రుచుల సమ్మేళ‌నం ఉగాది ప‌చ్చ‌డి..

ఉగాది పచ్చడి గురించి చెప్పుకుందాం…

ఆరు రకాల రుచులతో కలిపి చేసే ఉగాది పచ్చడి .. శారీరక,మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తుంది. కొంద‌రు రసం అని.. ప‌చ్చ‌డి అంటారు. ఎవ‌రు ఏ పేరుతో పిలిచినా సకల రోగాలకు చక్కని ఔషధం.

భారతదేశంలో అనేక ప్రాంతాలలో ఉగాది ని చేసుకుంటారు. ఇప్పుడు ఇతర దేశాలలో ఉన్న మన భారతీయులతో పాటు విదేశీయులు కూడా మనతో ఉగాది పండుగ చేసుకుంటున్నారు. ఋతువులతో కూడిన తొలి దినమే ఉగాది.

క్రొత్త కుండలో కొత్త చింతపండు, వేపపూవు, బెల్లం, మామిడి ముక్కలు,  ఉప్పు, కారం మొదలగున్నవి కలిపి ఉగాది పచ్చడి చేసి దేవుడికి అర్పించి తరువాత కుటుంబం అందరూ కలిసి ఆనందంగా ఆ రసాన్ని అస్వాదిస్తారు. ఉగాది పచ్చడి ఎంతో చెప్పలేని రుచిగా ఉంటుంది. ఆనందాన్ని కలిగిస్తుంది. రాబోయే రోజులలో శరీరానికి, మానసికంగా జబ్బులు రాకుండా ఈ పచ్చడిలో ఉన్న ఆరు రుచులతో ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఆరోగ్యాన్ని అందించటంలో అద్వితీయమైన పాత్ర పోషిస్తుంది. ఉగాది పచ్చడిలో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి.

ఇందులో మధుర, ఆమ్లా, లవణ, ఆరు రసములు సమపాళ్లలో కలిసి ఉంటాయి. ఈ పానకం వలన మసనసుకు ఉల్లాసాన్ని కలిగిస్తుంది.  కష్టాలు, సుఖాలు, మానం భరించాలంటూ తెలియచేస్తుంది. అన్ని రోజులు ఆనందంగా వుండవు, అన్ని రోజులు కష్టాలు కూడా ఉండవు. అన్నిటినీ ఆహ్వానిస్తూ జీవితం గడపటమే. అలాంటి వాటిని తట్టుకోవడానికి ముందు పులుపు, తీపి, కారం, మధురం, చేదు, వగరు కలిపి తయారుచేసే తినే పచ్చడి ఉగాది పచ్చడి అంటారు.

వేప యాంటీ బాక్టీరియలు, యాంటీ వైరల్ గుణాలు, యాంటీ ఫంగల్ గుణాలు కలిగి ఉన్నాయి. చర్మ వ్యాధులలో చక్కగా పనిచేస్తుంది. పెనుకోరుకుడికి కూడా చక్కగా పనిచేస్తుంది. ఇది తిక్త కాషాయ రసం లఘు గుణం, కలిగి ఉంది. ఇది కఫపిత్తములను శమింపచేస్తుంది. అగ్నిదీప్తిని కలిగిస్తుంది. అనేక జబ్బులకు 100 రకాల జబ్బులకు తగ్గించే గుణం దీనికి ఉంది.

మామిడి కాయాలో కూడా ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉన్నాయి. ఇది కఫపిత్తనాశకం, వాతహరం, గుండె జబ్బులు, మధుమేహం, లాంటి జబ్బులను తగ్గుస్తుంది. నరాల బలహీనతను పోగొడుతుంది. కడుపు నొప్పి తగ్గిస్తుంది. వడ దెబ్బ నుండి రక్షిస్తుంది.విటమిన్ C వుంటుడుట వలన ఆరోగ్య ముగా ఉండటానికి చక్కగా పనిచేస్తుంది.

ఉప్పు సరిగా శరీరానికి అందకపోతే చమట రాదు. చమట రాకపోతే చర్మ వ్యాధులు వస్తాయి. అధికంగా తీసుకుంటే బీపీ వస్తుంది. ఉగాది పచ్చడిలో ఉప్పు చాలా అవసరం చిటికెడు ఉప్పు వేస్తే పచ్చడి రుచే వేరు, సూపర్ గా ఉంటుంది. నోటిలో లాలాజలం ఊరుతుంది. శరీరానికి పుష్టిగా ఉంచడానికి, బలాన్ని ఇవ్వటానికి, ఎండలో తిరిగి వచ్చే వారికి మజ్జిగ లో చిటికెడు ఉప్పు వేసి ఇస్తే తక్షణమే శరీరానికి బలం చేకూరుతుంది. ఎండ దెబ్బ నుండి రక్షణ కలిగిస్తుంది.

బెల్లం లొ ఐరన్ ఎక్కువగా ఉంటుంది. అనేక పోషక విలువలు ఉంటాయి. ప్రొటీన్స్ లోపాన్ని బెల్లం తొలిగిస్తుంది.

-షేక్.బహర్ అలీ
యోగచార్యుడు

Leave A Reply

Your email address will not be published.