భార్య కాపురానికి రావడం లేదని భర్త బలవన్మరణం

నిజామాబాద్ (CLiC2NEWS): భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపం చెందిన ఓ వ్యక్తి పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఘటన నాగేపూర్ గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. ఇన్‌చార్జి ఎస్సై రవీందర్ తెలిపిన వివరాల మేరకు.. జిల్లాలోని నవీపేట మండలంలోని నాగేపూర్ గ్రామానికి చెందిన బోయిడి సతీశ్(32)కు ఫకిరాబాద్‌కు చెందిన పోసానితో పది సంవత్సరాల కిందట వివాహం జరిగింది. వీరికి పిల్లలు కలుగక పోవడంతో గొడవలు మొదలయ్యాయి.
గొడవల మూలంగా 3 నెలల క్రితం పోసాని పుట్టింటికి వెళ్లి పోయింది. ఈ క్రమంలోనే భార్య కాపురానికి రావాలని కుల పెద్దల సమక్షంలో పలుమార్లు కోరినా పోసాని అందుకు ససేమిరా అనడంతో మనస్తాపం చెందిన సతీశ్ ఈ నెల 4న పురుగుల మందు తాగి బలవన్మరణానికి యత్నించాడు. దీంతో అతన్ని ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ అదే రోజు మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.