మండపేటలో అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్ఠ..

మండపేట(CLiC2NEWS) : మండపేట పట్టణంలో పెరుగుతున్న అయ్యప్ప స్వామి వారి భక్తుల సౌకర్యార్థం పట్టణంలో మరో చిన్న అయ్యప్ప స్వామివారి ఆలయం వెలిసింది. స్థానిక పెద్ద కాలువ వంతెన దిగువన ఉన్న స్నాన ఘట్టం వద్ద స్వామి వారి ఆలయాన్ని నిర్మించారు. పట్టణ ప్రముఖుడు, వ్యాపారవేత్త కాళ్ళ సూర్యప్రకాశరావు, నాగావళి దంపతులు ఈ ఆలయాన్ని నిర్మించారు. బుధవారం నూతనంగా నిర్మించిన ఆలయంలో అయ్యప్ప స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. మున్సిపల్ మాజీ చైర్మన్ చుండ్రు శ్రీ వరప్రకాష్, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు వి సాయి కుమార్ బాబు ముఖ్య అతిథులుగా పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. గుమ్మిలేరు రోడ్డు అయ్యప్ప స్వామి ఆలయం ప్రధాన అర్చకులు మధు నంబూద్రి ఆధ్వర్యంలో అయ్యప్పకు విశేష పూజాభిషేకాలు జరిగాయి. స్వామి వారి 18 మెట్లకు జ్యోతి వెలిగించి పడి పూజ నిర్వహించారు. స్వామి శరణు ఘోషతో స్వాములు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో స్వామి మాలదారులు గురు స్వామి కొప్పాక సత్యనారాయణ (బాబి), నేమాని సత్య వెంకట కిరణ్ కుమార్, కోన సత్యనారాయణ, పోతంశెట్టి వీర వెంకట సత్యనారాయణ, కోనే వీర్రాజు, ముత్యాల సత్తిరాజు, పాలచర్ల శ్రీనివాస్ వీర వెంకట చౌదరి, రచ్చ రాజేంద్రప్రసాద్, బిక్కిన చక్రవర్తి, నిమ్మకాయల గోపాలకృష్ణ, బట్లంకి నాగరామ శంకరప్రసాద్, గాడు గణేశ్, కరసాల సత్యనారాయణ, మాండ్రు పెదకాపు, బిల్డర్ ఉషా శ్రీను అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అనంతరం స్వాములకు బిక్ష ఏర్పాటు చేశారు.