సిద్దిపేట: కొముర‌వెల్లి మ‌ల్ల‌న్న జాత‌ర ప్రారంభం..

సిద్దిపేట (CLiC2NEWS): జిల్లాలో ప్ర‌ముఖ‌ పుణ్య క్షేత్రం కొముర‌వెల్లి మ‌ల్ల‌న్న ఆల‌యంలో జాత‌ర వేడుక‌లు ఘ‌నంగా ప్రారంభ‌మ‌య్యాయి. ఈ జాత‌ర సుమారు రెండు నెల‌ల పాటు కొన‌సాగుతుంది. వ‌చ్చే ఉగాదికి ముందే వ్చే ఆదివారం వ‌ర‌కు ఈ జాత‌ర జ‌రుగుతుంది. సంక్రాంతి త‌ర్వాత వచ్చే ముందు ఆదివారం కావ‌డంతో భ‌క్తులు భారీగా త‌ర‌లివ‌చ్చారు. ప్ర‌తి ఆదివారం మ‌ల్ల‌న్న ఆల‌యంలో విశేష పూజా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తారు. భ‌క్తులు బోనాలతో స్వామివారిని ద‌ర్శించుకుంటారు. ప‌ట్నం వేసి క‌ల్యాణం జ‌రిపించి.. మొక్కులు చెల్లించుకుంటారు. తెలుగు రాష్ట్రాల‌నుండే కాక, ఇత‌ర రాష్ట్రాల నుండి భ‌క్తులు వచ్చే అవ‌కాశం ఉన్నందున అధికారులు భ‌క్తుల కోసం త‌గిన ఏర్పాట్లు చేశారు.

Leave A Reply

Your email address will not be published.