Mandapeta: ప్రవక్త జీవితం ఆదర్శం..

మండపేట (CLiC2NEWS): అంతిమ దైవ ప్రవక్త మహమ్మద్ రసూల్ సల్లేలాహు అలైహి వ సల్లెం వారి జీవితం అందరికీ ఆదర్శమని ఐ వై ఎం రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ ఇబ్రహీం షరీఫ్ పేర్కొన్నారు. మండపేట జమాతె ఇస్లామీ హింద్ ఆధ్వర్యంలో ప్రవక్త ముహమ్మద్ సల్లెలహు అలైహి వ సల్లం వారి జన్మదినాన్ని పురస్కరించుకొని ముహమ్మద్ ది గ్రేటేస్ట్ పుస్తకాన్ని పట్టణంలోని పలువురుకి ఆదివారం అందజేశారు.
ఈ సందర్భంగా దైవ ప్రవక్త వారి బోధనలతో తయారు చేసిన జ్ఞాపికలు పట్టణంలోని ప్రముఖులకు జమాత్ సభ్యులు అందజేశారు.ఈ సందర్భంగా ప్రవక్త వారి ప్రబోధనలు మానవాళిని సత్య మార్గం పై నడిపిస్తాయని పట్టణ కార్యనిర్వహక అధ్యక్షులు రిజ్వాన్ అన్నారు.ఐవైయం రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ ఇబ్రాహీం మాట్లాడుతు ప్రస్తుతం సమాజం ఎదుర్కుంటున్నా అన్ని సమస్యలకు ప్రవక్త వారి బోధనల్లో పరిష్కరం ఉంటుందని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జమాత్ కార్యదర్శి అలీ,సభ్యులు షహీద్,జైనులాబీదీన్,కార్యకర్తలు బాషా,ఫారుఖ్,రహీం,మిరా తదితరులు పాల్గొన్నారు.