రైతుల దైన్యం.. పాలకుల దౌష్ట్యం

కేంద్ర,రాష్ట్రాల కీచులాటల నాటకాలతో

కన్నీరుమయమవుతున్నవి కర్షకుల గాథలు

ప్రతిష్ఠకు పోతున్న పాలకులు అక్కడో… ఇక్కడో..

వడ్లు కొనాలని ఒక పక్క రోధనలు

వానకాలం సరే యాసంగిపై చర్చోపచర్చలు

తక్షణ సమస్యకు లేదు ప్రాధాన్యత

తప్పుఒప్పులు బేరీజులతో రాజకీయం

పైచేయి యోచనలు, ఎన్నికలు, అధికార యావలే

కళ్లాల్లో దాన్యం, కానరాదు నేతలకు

కోతకు వచ్చిన చేను కొనేందుకు ఆంక్షలు

రోడ్ల వెంట పడి ఉన్నాయి కుప్పల తెప్పలు

వర్షపు నీటి ప్రవాహం, రైతు కన్నీటి వరద సంద్రమై

వణుకు పెడుతున్నా, చలిలో తప్పని కాపలాలు

ఆరుగాలం కృషి నీటిలో తేలుతుంటే

గుండె చెరువై, కుప్పకూలిపోతున్నా

కర్షకుల కష్టాలు, ఆగచాట్లు వదిలి,

వీధి పోరాటాలతో నాయకగణం చేష్టలు

అవసరానికి ఆదుకోని రైతు బాంధవులే వారు

ప్రచారార్భాటంలో పోటాపోటీలు వారిలో

అన్నీ ఇస్తున్నామనే ప్రగల్బాల కంటే

అమ్ముకునే అవకాశం లేని ఆసరా ఏమిటది

కేంద్రమా, రాష్ట్రమా కాదు సమస్య

కష్టకాలంలో ఆదుకుంటేనే అండ

ముడి బియ్యమా, దంపుడు బియ్యమా

మిల్లర్ల ప్రయోజనమా, రైతుకు మేలా

అవినీతి, స్వార్థమే అంతటికి కారణం

తుఫాన్‌ తాకిడితో పెరుగుతున్న భయం

తడిసి, మెలకెత్తుతున్న ఖరీఫ్‌లో కష్టాలే

అంతా నష్టమే అయితే ఆత్మహత్యలే శరణ్యం

పాలకుల దౌష్ట్యంతో పడరాని పాట్లతో

మనసు విరిగిన ఆరాటం ఆగని ఆందోళనలు

-కోనేటి రంగయ్య
సీనియ‌ర్ పాత్రికేయులు

Gmail: rangaiahkoneti@gmail.com


త‌ప్ప‌క చ‌ద‌వండి:   

పౌత్ర పరిష్వంగన‌ సుఖం

కమ్మని పిలుపు

అప్పులు+అమ్మకాలు =పరిపాలన

తాలిబన్ అర్థం విద్యార్థి.. కానీ

నిరీక్షణ

శ్రావణ లక్ష్మికి స్వాగతం

కంప్యూటర్ కాపురాలు

అవసరం

మగ సమాజం

అహం అదే ఇగో   
విమాన యానం     
రాజకీయ జలకాలా`టలా`
కోనేటి రంగయ్య: ఆశల పల్లకిలో..
కోనేటి రంగయ్య: మనసు ఆరాటం
Leave A Reply

Your email address will not be published.