నేటి నుండి ఎపిలో కొత్త జిల్లాల పాలన ప్రారంభం..

అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల్లో నేటి నుండి కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సోమవారం కొత్త జిల్లాలను ప్రారంభించారు. జిల్లా స్థాయిలో వికేంద్రీకరణతో రాష్ట్ర ప్రజలకు మంచి జరిగే గొప్ప రోజు అవుతుందని సిఎం అన్నారు. ఈసందర్భంగా ప్రజలకు, అధికారులకు, ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపారు. పరిపాలనా సౌలభ్యం, వికేంద్రీకరణ అవసరం మేరకే కొత్త జిల్లాలు అని సిఎం స్పష్టం చేశారు. ఎపితో పోల్చుకుంటే తక్కువ జనాభా ఉన్న అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోనే 26 జిల్లాలు ఉన్నాయన్నారు. జనాభా ప్రాతిపదికన చూసుకుంటే ఎపికి జిల్లాల ఏర్పాటు అవసరం తప్పక ఉందని పేర్కొన్నారు.