మనిషి కోసం తపన

భయంకర పాశానుల మధ్య
మానవత్వ దీపం కొండెక్కిపోతుంటే…
జగతిని జాగృత పర్చే
మనసున్న మనిషన్న వాడి జాడేలేక
రోధిస్తున్నది పకృతి మాత ..!
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని
కనుగొన్నామనీ
భూగోళాన్ని అణుబాంబులా మారుస్తు
పకృతిని నాశనం చేస్తూ..
పక్షులు ప్రాణులు కోల్పోతుంటే…
జగతిని జాగృత పర్చే
మనసున్న మనిషన్న వాడి జాడేలేక
రోధిస్తున్నది పకృతి మాత ..!
అమాయక జీవులందరిపై
అడుగడుగున అవాంఛనీయ దుర్ఘటనలు జరుగుతుంటే…
జగతిని జాగృత పర్చే
మనసున్న మనిషన్న వాడి జాడేలేక
రోధిస్తున్నది పకృతి మాత ..!
ధర్మపీఠంపై అధర్మనాట్యకేళి
సాగుతుంటే…
జగతిని జాగృత పర్చే
మనసున్న మనిషన్న వాడి జాడేలేక
రోధిస్తున్నది పకృతి మాత ..!
యువతి యువకుల్లారా ఇకనైనా
మేల్కొనండి
పకృతి మాత కన్నీళ్లను తుడిచి
నూతన శకానికి స్వాగతం పలకండి.
-శ్రీమతి మంజుల పత్తిపాటి