డిజిపి అధికారి అంజనీకుమార్‌పై సస్పెన్షన్ ఎత్తివేత
The suspension of DGP Anjani Kumar has been lifted

హైదరాబాద్ (CLiC2NEWS): ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారంటూ.. తెలంగాణ డిజిపిగా ఉన్న అంజనీకుమార్‌ను కేంద్ర ఎన్నికల సంఘం (ఇసి) సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఇసి సస్పెన్షన్‌ను ఎత్తి వేసింది. ఎన్నికల ఫలితాలు వెలువడే సమయంలో అంజనీ కుమార్ రేవంత్‌రెడ్డిని కలిశారు. ఉద్దేశపూర్వకంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించలేదని.. రేవంత్ రెడ్డి పిలిస్తేనే వెళ్లానని ఆయన ఇసికి వివరణ ఇచ్చారు. మరోసారి ఇటువంటిది జరగదని హామీ ఇచ్చారు. ఆయన విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుని సస్పెన్షన్ ను ఇసి ఎత్తివేసినట్లు సమాచారం. ఈ మేరకు తెలంగాన రాష్ట్ర ప్రభుత్వానికి ఇసి సమాచారం ఇచ్చింది.