తిమింగలం నోటి నుండి బయట పడ్డ యువకుడు..
![](https://clic2news.com/wp-content/themes/publisher/images/default-thumb/publisher-lg.png)
Chili: సముద్రంలో ఓ యువకుడిని తిమింగలం నోటకరిచి.. కొంతసేపటి తర్వాత విడిచిపెట్టింది. ఈ ఘటన చిలీలోని పటగోనియా తీరానికి సమీపంలో చోటుచేసుకుంది. ఆడ్రియన్ సిమన్‌కాస్ అనే యువకుడు, తన తండ్రితో కలిసి చిన్న పడవతో సముద్రలోకి వెళ్లారు. అక్కడ ఎదురుపడిన హంప్‌బ్యాక్ తిమింగలం యువకుడిని , అతని చిన్న బోటుని నోటకరచి.. కొంత సేపటి తర్వాత వదిలేసింది. ఈ దృశ్యాన్ని యువకుడు తండ్రి కెమెరాలో బంధించం విశేషం. కుమారుడికి కొంత దూరంలోనే ఉన్నాడు. తిమింగలం నుండి బయటపడ్డ ఆ యువకుడు మీడియాతో మాట్లాడుతూ.. భయనక అనుభవాన్ని వివరించాడు. నాపని అయిపోయిందనుకున్నా.. తిమింగలం నన్న మింగేస్తుందని భయపడ్డానంటూ అనుభవాన్ని తెలిపాడు. చిలీ సముద్ర జలాల్లో తిమింగిలాలు చాలా అరుదుగా మనుషులపై దాడి చేస్తుంటాయని చెపుతున్నారు.