IMA: భారత్‌లో మళ్లీ లాక్‌డౌన్ పరిస్థితి రాదు!
![](https://clic2news.com/wp-content/uploads/2021/04/delhi-lockdown-750x313.jpg)
ఢిల్లీ (CLiC2NEWS): ప్రపంచలోని పలు దేశాల్లో కొవిడ్ విజృంభిస్తుండటంతో భారత్ అప్రమత్తమైనది. భారత్‌లో తాజాగా ఒమిక్రాన్ ఉపరకం బిఎఫ్.7 కేసులు నమోదైన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పలు సూచనలు చేసింది. ఈ క్రమంలో భారత్‌లో మళ్లీ లాక్‌డౌన్ వస్తుందేమోనని కలవరం నెలకొంది. ఈ తరుణంలో భారత వైద్య సమాఖ్యకు చెందిన డా. అనిల్ గోయల్ స్పష్టతనిచ్చారు.
భారత్ ప్రజలలో 95% మందికి కొవిడ్ టీకా పూర్తయిందని.. చైనా ప్రజలకంటే భారతీయుల్లో రోగనిరోధక శక్తి అధికంగా ఉందని అన్నారు. లాక్‌డైన్ వంటి పరిస్థితి రాదని ఆయన తెలిపారు. మరోవైపు పౌరులందరూ తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు తప్పక పాటించాలని ఐఎమ్ ఎ విజ్ఞప్తి చేసింది.