మూడు రోజులు భారీ వర్షాలు

హైదరాబాద్‌ (CLiC2NEWS): బంగాళాఖాతంలో ఏర్ప‌డిన అల్ప‌పీడ‌నం, తీవ్రంగా బ‌ల‌ప‌డిన‌ట్లు హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం పేర్కొంది. దీని ప్ర‌భావంతో తెలంగాణ రాష్ట్రంలో రానున్న మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావ‌ర‌ణ కేంద్రం తెలిపింది. తూర్పు, మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడిందని.. దానికి అనుబంధంగా ఆవర్తనం కొనసాగుతుందని, అది సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉందని పేర్కొంది. పశ్చిమ- వాయువ్య దిశగా అల్పపీడనం ప్రయాణిస్తుందని తెలిపింది. ఇది కొన్ని గంటల్లో ఒడిశా – బెంగాల్‌ తీరం వద్ద వాయుగుండంగా మారే అవకాశాలున్నట్లు వివరించింది.

తెలంగాణలోకి పశ్చిమ దిశ నుంచి కిందిస్థాయి గాలులు వీస్తున్నాయని పేర్కొంది. వీటి ప్రభావంతో రేపు, ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. రానున్న 3రోజులు ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

Leave A Reply

Your email address will not be published.